VIDEO: పెచ్చులూడిన పైకప్పు.. తప్పిన ప్రమాదం
KRNL: దేవనకొండ జడ్పీ ప్రాథమిక పాఠశాలలో భవనాల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. తరగతి గదిలో చదువు చెప్తున్న వేళ పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. విద్యార్థులు కొద్ది దూరంలో ఉండటంతో ప్రమాదం తప్పిందని ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహమ్మద్ తెలిపారు. పది భవనాలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. తరచూ పెచ్చులు ఊడి పడుతుండటంతో విద్యార్థుల భద్రతకు ముప్పు నెలకొందన్నారు