మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది: ఎమ్మెల్యే

MBNR: మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని శిల్పారామం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, యూనిఫాంలను జిల్లా కలెక్టర్‌తో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీరంతా కష్టపడి పనిచేస్తున్నందుకే పట్టణం పరిశుభ్రంగా ఉందన్నారు.