VIDEO: గోశాలకు గ్రాస్ కటింగ్ మిషన్ విరాళం
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన గోశాలకు ఏలూరు జిల్లా వేగివాడకు చెందిన ఓ వ్యక్తి గ్రాస్ కటింగ్ మిషన్ విరాళంగా ఇచ్చారు. దాని విలువ రూ. 50,000 ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈవో పెంచల కిషోర్ చేతుల మీదుగా పరికరానికి పూజ చేసి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.