ఈనెల 7న కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం

ఈనెల 7న కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం

ఏలూరు: ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు, పవరుపేటలోని గాంధీ నగర్ అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కోకో సాగు చేసే అన్ని జిల్లాల నుండి కోకో రైతుల సంఘం ప్రతినిధులు పాల్గొనవలసిందిగా కోరారు.