ఇక ఆ భూములు ఎవరికీ ఇవ్వరు..!

ఇక ఆ భూములు ఎవరికీ ఇవ్వరు..!

TPT: తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించబోమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు మీటింగ్ బుధవారం జరిగింది. తిరుపతి అర్బన్ సర్వే నెం.588-ఏలోని టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీడీఏకు బదలాయించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.