కొండలను గుల్ల చేస్తున్న నేతలు

కొండలను గుల్ల చేస్తున్న నేతలు

అల్లూరి: చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో అధికార, ప్రతిపక్ష నాయకులు కొండలను గుల్ల చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో పశువులకు గడ్డిలేకుండా పోతుందన్నారు.