పోలింగ్ కేంద్రాల్లో వసతులు ఉండాలి: అబ్జర్వర్
SRPT: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ జి.ఎస్. పాండా దాస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. చెల్లని ఓట్ల సంఖ్యను తగ్గించేలా ఓటర్లకు వీడియోల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.