228 విమానాలు రద్దు.. 800 ఫ్లైట్స్ ఆలస్యం

228 విమానాలు రద్దు.. 800 ఫ్లైట్స్ ఆలస్యం

ఢిల్లీలో దట్టమైన పొగమంచు విమానయానాన్ని స్తంభింపజేసింది. సరిగా కనిపించకపోవడం కారణంగా (విజిబిలిటీ లేక) 228కి పైగా విమానాలు రద్దు కాగా, 800కు పైగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 5 విమానాలను ఇప్పటికే దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులపై ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. టికెట్ రీ-షెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్ చేస్తామని ప్రకటించింది.