'కంటోన్‌మెంట్‌లో మంచినీటి ఎద్దడి లేకుండా చేస్తా'
HYD: కంటోన్‌మెంట్‌లో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని MLA శ్రీగణేశ్ తెలిపారు. ప్రభుత్వ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్‌తో నిర్మించిన కొత్త పవర్ బోర్‌వెల్‌ను ఆయన ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నీటి ఇబ్బందిని తీర్చినందుకు బస్తీవాసులు MLAకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.