అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకలు
నారాయణపేట జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా కేకుల కొనుగోలుకు బేకరీల వద్ద గుంపులు గుంపులుగా జనం తరలివచ్చారు. 2026 సంవత్సరాన్ని సంతోషం, ఆహ్లాదకరమైన వాతావరణంలో కేక్ కటింగ్‌తో ఆహ్వానించేందుకు నగర ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా జిల్లా కేంద్రం మొత్తం ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ వేడుకలతో కళకళలాడుతోంది.