VIDEO: 'మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా కనిపించటం లేదు'

HYD: గ్రూప్-1 తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు MP చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల BRS పాలనలో ఉద్యోగాల నియామకాలు చేపట్టలేదని, పరీక్షపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో పెట్టిన ప్రజలకోసం మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడ కనిపించటం లేదన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు.