సీసీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే
ATP: నసనకోట గ్రామంలో రూ. 55 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను తనిఖీ చేశారు. గ్రామంలో ఇంకా నిర్మించాల్సిన రహదారుల అవసరాల గురించి స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులతో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.