OUలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
HYD: విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని ఆక్సిజన్ పార్కులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి హుజూరాబాద్ ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.