సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ సీఎం చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలు, జిల్లాలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. కోడిరామూర్తి స్టేడియం అభివృద్ధికి రూ.3.5 కోట్లు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.