ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

PDPL: అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు ఇన్ ఫ్లో 72,866 క్యూసెక్కులుగా ఉంది. అవుట్లో 65,144 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్ సామర్థ్యం 20.175 TMCలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వలు 18.9806 టీఎంసీలు 147.58/148.00 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 12 గేట్ల ద్వారా 64,716 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.