పలిమెలలో యూరియా విక్రయ కేంద్రం ప్రారంభం

BHPL: పలిమెల మండల రైతు వేదికలో గురువారం మహాదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా విక్రయ కేంద్రాన్ని ఛైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 10 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏవో సుప్రజ్యోతి, ఎస్సై రమేశ్, ఏఈవోలు, తదితరులు ఉన్నారు.