జియాగూడలో శోభాయాత్ర

జియాగూడలో శోభాయాత్ర

HYD: బసవ జయంతి సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ బసవ దళ్ ప్రతినిధులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బసవ మండపం వద్ద ప్రారంభమై జియాగూడ మెయిన్ రోడ్డు, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, ఎంజే మార్కెట్ వరకు యాత్ర సాగుతుందన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.