భద్రాద్రిలో కనువిందుగా గోదావరి హారతి
KMM: దక్షిణ అయోధ్య భద్రాద్రిలో గోదావరి నదీ హారతి పర్వం భక్తిశ్రద్ధలతో సాగింది. చైత్ర శుద్ధ దశమి సందర్భంగా ఇవాళ సాయంత్రం గోదావరి కరకట్ట వద్ద నిర్వహించిన ఈ వేడుకలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పురోహితుడు రవికుమార్ ఆధ్వర్యంలో నదికి అష్టోత్తర శతనామార్చన, దీపోత్సవం నిర్వహించారు. వారణాసి, కాశీకి చెందిన భక్తులు ప్రసాద వితరణ చేశారు.