పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి విమర్శలు

పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి విమర్శలు

GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోమవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. రూ.167 కోట్లకు బదులు రూ.97 కోట్లకు శంకర్ విలాస్ బ్రిడ్జి వ్యయాన్ని ఎందుకు తగ్గించారని, ఇందులో గోల్ మాల్ ఉందని ప్రశ్నించారు. ఇది గుంటూరుకు నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణానికి ముందుగా సర్వీసు రోడ్లు, ఆర్యూబీ పూర్తి చేయాలని అంబటి డిమాండ్ చేశారు.