'పాంచ్‌మినార్' రిలీజ్ డేట్ ఫిక్స్

'పాంచ్‌మినార్' రిలీజ్ డేట్ ఫిక్స్

యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పాంచ్‌మినార్'. రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాజీ, రవి వర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.