'మా ఓటు డబ్బుకు, మద్యానికి అమ్ముకోము'
NLG: మర్రిగూడ మండలం నేటి చంద్రాపురం గ్రామంలో పగిళ్ల రామచంద్రయ్య దంపతులు, మా ఓటు డబ్బుకు, మద్యానికి అమ్ముకోమని తమ ఇంటి గోడపై హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఓటు అడగడానికి వచ్చే సర్పంచి, వార్డు మెంబర్ అభ్యర్థులు బోర్డు చదివి ఇంట్లోకి రావాలన్నారు. ఆదివారం ఇది చూసిన స్థానిక గ్రామస్తులు పలువురు ఆ కుటుంబాన్ని శాలువాతో సన్మానించారు.