పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు NRCలు: మంత్రి
PPM: నేషనల్ హెల్త్ మిషన్ కింద పార్వతీపురం మన్యం జిల్లాలో 5 NRC లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు సేవలు అందించేందుకు వీలుగా న్యూట్రిషన్ రిహబిలిటేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. 5 పడకలతో సాలూరు, పాలకొండ, భద్రగిరి, కురుపాం, చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.