రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంతర్జాతీయంగా భారతదేశ స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్త జగదీష్ భగవతి వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. గతంలో ప్రపంచ బ్యాంకు భారత్ కు ఏం చేయాలో చెప్పేదని, కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకు ఏం చేయాలో భారత్ సూచిస్తోందని భగవతి అన్నారని పేర్కొన్నారు. గత 11 ఏళ్లుగా భారత్ స్వావలంబన, ప్రపంచంతో పోటీపడే ఆర్థిక శక్తిగా మారిందని అన్నారు.