ఆరోగ్య సిబ్బందికి హెపటైటిస్-బి వ్యాక్సిన్

ఆరోగ్య సిబ్బందికి హెపటైటిస్-బి వ్యాక్సిన్

యాదాద్రి: ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ హెపటైటిస్-బి వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. మనోహర్ అన్నారు. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో హెల్త్‌కేర్ వర్కర్ల కోసం హెపటైటిస్-బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.