నెహ్రూపై రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు
నెహ్రూపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. మతపరమైన స్థలాల నిర్మాణానికి ప్రజా నిధులను ఎప్పుడూ ఉపయోగించకూడదని నెహ్రూ నిర్ణయించుకున్నారన్నారు. కేంద్రమంత్రి మాటలు వర్తమానాన్ని విభజించడానికి గతాన్ని తిరిగి రాయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని తెలిపారు.