కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలించిన కలెక్టర్
NTR: నందిగామ నియోజకవర్గం రాఘవపురంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. సోమవారం కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ ఏడాది తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అక్కడ వసతులు అడ్మిషన్ల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. 2026-27 విద్యాసంవత్సరానికి మొత్తం 400 సీట్లు అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు.