అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

W.G: జిల్లాలో నిర్మాణం పూర్తి అయిన మల్టీపర్పస్ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాకు నాబార్డ్ మంజూరు చేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామన్నారు.