నగరంలో హోటల్స్‌పై కొనసాగుతున్న ఐటీ దాడులు

నగరంలో హోటల్స్‌పై కొనసాగుతున్న ఐటీ దాడులు

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్ యజమానులపై ఐటీ శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐటీ అధికారులు లక్డీకాపూల్‌లోని వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని ప్రశ్నించారు. గతంలో సోదాలు జరిగిన పిస్తా హౌస్, షా గౌస్, మెహఫిల్ హోటల్స్‌లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.