జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..!
NLG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, మొదటివిడత నామినేషన్ల పక్రియ మొదలయిన విషయం తెలిసిందే. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల కోసం సీఎం రేవంత్ జిల్లాల వారీగా ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 6న దేవరకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా CM సభలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయశంగా మారింది.