'గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి'
KMR: మాచారెడ్డి గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. మంగళవారం మండలంలోని సోమవారంపేట్ గ్రామ నాయకులు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిని గెలిపించిన నాయకులను ఆయన అభినందించారు.