కరివిరాల చెరువు కాలువ ఆక్రమణల తొలగింపు
SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామ చెరువుకు నీటి కష్టాలు తీరనున్నాయి. కొంతకాలంగా అన్యాక్రాంతమైన చెరువు కాలువ ఆక్రమణలను తొలగించి, ఉపాధి హామీ పథకం కింద పునరుద్ధరణ పనులు చేపట్టారు. కూలీలతో కాలువ పూడికతీత పనులు పూర్తి చేయడంతో వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరేలా మార్గం సుగమమైంది. నీటి సమస్య పరిష్కారం పట్ల గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.