సీఎం నిర్ణయంపై మంత్రి సత్యకుమార్ హర్షం

సత్యసాయి: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతిని రాష్ట్ర పండగగా ప్రకటించడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తన బోధనలతో భారతీయ ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు పుట్టపర్తి సత్యసాయి బాబా అని మంత్రి కొనియాడారు. జిల్లా ప్రజల దాహార్తిని తీర్చారని తెలిపారు.