గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి

BDK: అశ్వాపురంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. మల్లమ్మ సెంటర్‌కు చెందిన ఎస్డీ జానీకి ఇవాళ తెల్లవారుజామున అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.