పురుగుల మందు తాగి యువకుడు మృతి

పురుగుల మందు తాగి యువకుడు మృతి

ADB: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామానికి చెందిన తుప్ప నరేష్ (36) గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్య,అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం పురుగుల మందు సేవించగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.