సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని MLAకు వినతి
KMR: బీర్కూర్ మండలంలోని YSR కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతూ కాలనీ వాసులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. కాలనీలో డ్రైనేజీలు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అలాగే, సీసీ రోడ్డు నిర్మించాలన్నారు.