చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో సస్పెండ్
HYD: చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దాతలు ఇచ్చిన ఆభరణాలు, 2.30 కిలోల వెండి కిరీటం, ప్రసాదాల తూకంలోనూ తేడాలున్నట్లు గుర్తించారు. అవకతవకలు బయటపడడంతో ఈవో రామాంజనేయులును సస్పెండ్ చేశారు. టికెట్ల సేవలను డిజిటల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.