ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో తప్పిన ప్రమాదం

ఎంజీఎం నర్సింగ్ హాస్టల్‌లో తప్పిన ప్రమాదం

WGL: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని నర్సింగ్ హాస్టల్లో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి నర్సింగ్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఒక్కసారిగా శబ్దం రావడంతో నర్సింగ్ విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరినా మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.