పటేల్ వారసులతో ప్రధాని మోదీ

పటేల్ వారసులతో ప్రధాని మోదీ

భారతదేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. గుజరాత్‌లోని కెవాడియాలో పటేల్ కుటుంబాన్ని కలిసినట్లు మోదీ 'X'లో పోస్ట్ చేశారు. దేశానికి పటేల్ చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ప్రధాని ఇవాళ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించి, ఐక్యత సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.