VIDEO: సింహాచలంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన

VSP: సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు వేకువజామున సుప్రభాత సేవలతో స్వామిని మేల్కొలిపి, వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామిని సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు.