ఎస్సైను ఘనంగా సత్కరించిన మహిళా పోలీసులు
VZM: వేపాడ మండలంలో ఉన్న 18 సచివాలయ మహిళా పోలీసులు వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్‌ను మంగళవారం శాలువతో ఘనంగా సత్కరించారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు దొంగతనాల కేసులలో ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. దొంగలను పట్టుకొని, వారి నుంచి చోరీ చేసిన బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. కాగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ నుంచి ప్రశంసలు పొందారు.