నెల్లూరులో నారాయణ మార్క్ దోపిడీ: కాకాణి ధ్వజం

నెల్లూరులో నారాయణ మార్క్ దోపిడీ: కాకాణి ధ్వజం

నెల్లూరు కార్పోరేషన్‌లో‌ TDP దోపిడీ మొదలైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. చెట్లు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వీఆర్ హైస్కూల్ విషయంలోనూ ఇదే తీరని ఆయన పేర్కొన్నారు.