VIDEO: భక్తులతో సందడిగా మారిన బాసర సరస్వతి ఆలయం
NRML: బాసర సరస్వతి అమ్మవారిని కార్తీక మాసం ఆదివారం సందర్బంగా దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛరణాల మధ్య అభిషేకం, అర్చన, హారతి నిర్వహించారు. పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి తల్లిదండ్రులు చిన్నారులకు ఆలయంలో అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన చేయించారు.