శంకర్ విలాస్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

GNTR: నగరంలో శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.98కోట్లతో వంతెనను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ నాగలక్ష్మీ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తదితరులు పాల్గొన్నారు.