'రద్దు చేసిన వికలాంగులు పెన్షన్‌లను వెంటనే ఇవ్వాలి'

PPM: రద్దు చేసిన వికలాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా హామీల వర్షం కురిపించిన కూటమి నేతలు ఇప్పుడు పెన్షన్లు కుదించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు.