సింగరేణిలో భద్రతపై అవగాహన కార్యక్రమం
PDPL సింగరేణి RG–1 ఏరియా ఇల్లందు క్లబ్‌లో సూపర్వైజర్‌లకు జీఎం రెస్క్యూ కె. శ్రీనివాస్ రెడ్డి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా జీఎం డి. లలిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గనుల్లో ప్రమాదాల నివారణ, విద్యుత్ భద్రత, భారీ యంత్రాల కదలికల నియంత్రణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సున్నా హాని సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.