అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం సమీక్ష నిర్వహించారు. సహకార శాఖ, (DRDA) మరియు విద్యాశాఖ అధికారులతో సమావేశమై, ప్రజలకు అందిస్తున్న సేవల పురోగతిని సమీక్షించారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల సంక్షేమం సక్రమంగా చేరుతుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు చురుగ్గా పని చేయాలన్నారు.