సరస్వతి బ్యారేజీలో తగ్గిన వరద ప్రవాహం

సరస్వతి బ్యారేజీలో తగ్గిన వరద ప్రవాహం

BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న అన్నారం సరస్వతి బ్యారేజీలో వరద ప్రవాహం భారీగా తగ్గుతోంది. మంగళవారం 28,967 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 27వేల క్యూసెక్కుల వరద ప్రవాహం తగ్గింది. సుందిళ్ల పార్వతి బ్యారేజీ నుంచి 86,470 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 66,446 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది.