ఆదోనిలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు: రైతులు
KRNL: ఇస్వీ గ్రామంలో ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బసవేశ్వర స్వామి ఆలయం ఎదురుగా రెండు రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రభుత్వ వాట్సాప్ పబ్లిక్ సర్వీస్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు.