RFCL కొత్త సీఈఓగా సంజీవ్ గులాటి

RFCL కొత్త సీఈఓగా సంజీవ్ గులాటి

PDPL: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నూతన సీఈఓగా సంజీవ్ గులాటి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్, ప్లాంట్ నిర్వహణలో నిపుణులు. సంజీవ్ గులాటి నాయకత్వంలో సంస్థ మరిన్ని ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.