VIDEO: నియోజకవర్గ సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం
MDK: రామాయంపేట నియోజకవర్గ సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రమౌతుంది. నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2009 వరకు నియోజకవర్గంలో ఉన్న రామాయంపేట డీలిమిటేషన్‌లో తొలగిపోయిందని, తిరిగి నియోజకవర్గ ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు తీర్మానించారు.